మళ్లీ స్టీఫెన్‌సన్‌కే అవకాశం.. కేబినెట్‌ నిర్ణయం ‌political news


హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్‌ శాసన సభ్యుడిగా స్టీఫెన్‌సన్‌ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో తీర్మానం చేసింది. నియామకానికి సంబంధించిన ప్రతిని గవర్నర్‌ నరసింహన్‌కు పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం తెలంగాణ తొలి మంత్రివర్గ సమావేశం జరగింది. సమావేశంలో హోంమంత్రి మహమూద్‌ అలీ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలతో పాటే నామినేటెడ్‌ సభ్యుడి ప్రమాణ స్వీకారం జరపాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గం అభినందించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశంసించింది. ఎన్నికైన సభ్యులకు రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనల ప్రతులను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో పుస్తకాలు, బుక్‌లెట్ల రూపంలో ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. సభ్యులకు అందించే ప్రతులను సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీ కార్యదర్శి చూపించారు.

స్టీఫెన్‌ సన్‌నే ఎందుకు..?

తెలంగాణ శాసనసభ వాస్తవ బలం 120. ఇందులో 119 మంది ఎన్నికల ద్వారా వస్తారు. మిగిలిన స్థానంలో ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడిని నియమిస్తారు. గత ప్రభుత్వంలో స్టీఫెన్‌సన్‌ ఆంగ్లో ఇండియన్‌ శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ‘ఓటుకు నోటు’ ఉదంతం జరిగింది. ఆ సమయంలో స్టీఫెన్‌సన్‌ తన వద్దకు బేరసారాలకు వచ్చిన వ్యక్తుల సమాచారాన్ని సీఎం కేసీఆర్‌కు అందించి, వారిని పట్టుకునేందుకు అనువుగా వ్యవహరించారు. నిజాయతీగా వ్యవహరించినందున ఆయనకే మళ్లీ అవకాశం ఇచ్చారు. స్టీఫెన్‌సన్‌ ఎంపికతో తెరాస బలం 91కి చేరుతుంది. ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడికి ఎమ్మెల్యేలతో సమానంగా అవకాశాలుంటాయి. శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లోనూ ఓటు వేయవచ్చు.

political news
Hariyan Srinivas
political news
Jan 07, 2018
political news
Political News


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...