‘ప్రశ్నించడమే నేను చేసిన పాపమా?’ప్రధాని మోదీపై మండిపడిన సీఎం చంద్రబాబుpolitical news


నిడదవోలు: విభజన చట్టంలోని హామీలను అమలు చేయమని ప్రశ్నించడమే తాను చేసిన పాపం అన్నట్లుగా ప్రధాని మోదీ తనపై విమర్శలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన కుటుంబంపై మోదీ చేసిన వ్యక్తిగత విమర్శలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రూ.200 కోట్లతో నిడదవోలులో నిర్మించనున్న వంతెనకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పట్టణంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

నమ్మకద్రోహం వల్లే ఎన్డీయే నుంచి బయటకు..

ప్రధాని మోదీ మట్టి, నీళ్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అణచివేతకు యత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయకపోవడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వకుండా నమ్మకద్రోహం చేయడం వల్లే ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. విభజన హామీలను అమలు చేయాలని పోరాటం చేస్తుంటే ఐటీ, సీబీఐ దాడులు అంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌పై కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసులో కేంద్రం కావాలనే కలుగజేసుకుంటోందని విమర్శించారు. ఈ ఏడాది మే నాటికి పోలవరం పూర్తి చేసి జూన్‌ కల్లా గ్రావిటీతో నీళ్లు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నా.. కేంద్రం మాత్రం నిధులు విడుదల చేయడం లేదని చంద్రబాబు ఆరోపించారు.

political news
Hariyan Srinivas
political news
Jan 07, 2018
political news
Political News


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...