2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ వల్ల నష్టమెవరికి? చంద్రబాబుకా? జగన్‌కా?political news


2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ వల్ల నష్టమెవరికి? చంద్రబాబుకా? జగన్‌కా? అన్న ప్రశ్న చాలాకాలంగా ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. దీనిపై ఎవరి లెక్కలు వారు చెబుతున్నా ఇంతవరకు స్పష్టంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి. కానీ... వైసీపీ అధినేత జగన్ తొలిసారి ఈ పవన్ ఫ్యాక్టర్‌పై స్పష్టత ఇచ్చారు. స్పష్టమైన అవగాహన రాజకీయ విశ్లేషణతో జగన్ చెప్పిన మాటలు వాస్తవాలకు అత్యంత దగ్గరగా ఉండడంతో పాటు లాజిక్ పరంగానూ ఆమోదయోగ్యంగా కనిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీలకు మద్దతుగాప్రచారం చేసిన పవన్ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తానంటున్నారు. మరోవైపు తమతో కలవాలంటూ చంద్రబాబు ఇంకా ఆయన కోసం తలుపులు తెరిచే ఉంచారు. గతసారి ఓపెన్‌గా కలిసి పనిచేశారు. ఈసారి విడిపోయినట్లు నటిస్తూ కలిసి పనిచేస్తున్నట్లుగా ఉన్నారంటూ వాస్తవ చిత్రాన్ని చెప్పిన జగన్... అసలు పవన్ ఈ ఎన్నికల బరిలో తన పార్టీని నిలపడం వల్ల ఎవరికి నష్టమన్నది తేల్చారు.

ఇక పవన్ చంద్రబాబు మళ్లీ కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం తమకు మల్లుతుందని జగన్ సూత్రీకరించారు. కాబట్టి పవన్ పోటీ చేయడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదన్నారు.

ఇక పవన్ తమతో కలుస్తారని చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఇంతవరకు తనతో పవన్ కానీ పవన్‌తో తాను కానీ మాట్లాడలేదని చెప్పారు. పైగా ఏళ్ల తరబడి వైసీపీ జెండా మోస్తున్న నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పుడు వారికి అన్యాయం చేస్తూ ఎవరికో తాను సీట్లు పంచిపెట్టబోనని చెప్పారు.

political news
Hariyan Srinivas
political news
Jan 06, 2018
political news
Political News


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...