మీడియాను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడైన ఏపీ సీఎం ఇప్పుడు మీడియాను బెదిరించి మరీ తన వార్తలు ‌వేయించుకునేందుకు కొత్త మార్గంpolitical news


మీడియాను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు మీడియాను బెదిరించి మరీ తన వార్తలు వేయించుకునేందుకు కొత్త మార్గం ఎంచుకున్నారట. దీని కోసం ఏకంగా పెద్ద టీంనే పెట్టుకున్నారట. ఆ టీం నిత్యం టీవీ చానళ్లను చూస్తూ.... చంద్రబాబు వార్తలను ఏ చానల్ ఎంత కవర్ చేసింది.. చంద్రబాబు మాట్లాడినప్పుడు ఎన్ని నిమిషాలు చూపించారు.. వంటి స్టాటిస్టిక్స్ అన్నీ రెడీ చేస్తారు. దాని ప్రకారం తనకు తక్కువ కవరేజి ఇచ్చే మీడియా సంస్థలకు ప్రకటనలు ఇవ్వబోమంటూ గవర్నమెంటు నుంచి బెదిరింపులు వెళ్తాయి. ఇదీ టీడీపీ అధినేత ప్లానట.

ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు తన యాక్టివిటీ మరింత పెంచనున్నారు. రోజుకు మూడు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవన్నీ మీడియాలో కవర్ కావాలి. ఎలా కవర్ అవుతుందన్న స్టాటిస్టిక్స్ ఈ టీం ఇస్తుంది.

చంద్రబాబు రోజూ పాల్గొనే మూడు కార్యక్రమాల్లో ఒక్కొక్కదాంట్లో కనీసం గంట మాట్లాడుతారు. ఆ లెక్కన ప్రతి మీడియా సంస్థ మూడు గంటల పాటు చంద్రబాబు ప్రసంగాలు చూపించాలన్నది ఆయన కోరిక.

నిజానికి చంద్రబాబు వార్తలను ప్రధానంగా మూడు మీడియా సంస్థలు ఇప్పటికే విస్తారంగా కవర్ చేస్తున్నాయి. వాటి బాటలోనే మిగతా సంస్థలూ పయనించాలన్నది చంద్రబాబు కోరిక. అన్ని మీడియా సంస్థలూ రోజంతా తన వార్తలే చూపించేలా చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే.. ఈ లెక్కలు తీసి సంస్థలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రకటనల ఆదాయమే సంస్థలకు ప్రధానం కాబట్టి అవన్నీ దారికొస్తాయన్నది చంద్రబాబు ప్లానుగా తెలుస్తోంది.

political news
Hariyan Srinivas
political news
Jan 04, 2018
political news
Political News


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...