జన్మభూమి అర్జీలు సంఖ్య తగ్గడం ప్రభుత్వం ప్రగతి పథంలో నడుస్తుందనేందుకు నిదర్శనమన ఐఏఎస్‌ అధికారిణి మాధవిలతnellore political news


గత ఐదు జన్మభూమి కార్యక్రమాల్లో ఎవరిచేతిలో చూసినా తెల్లకాగితాలు కనపడేవని, నేటి జన్మభూమిలో అర్జీలు సంఖ్య తగ్గడం ప్రభుత్వం ప్రగతి పథంలో నడుస్తుందనేందుకు నిదర్శనమని కావలి డివిజన్‌ పరిశీలికులు, ఐఏఎస్‌ అధికారిణి మాధవిలత తెలిపారు. పట్టణంలోని 20వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో రేషన్‌కార్డు, పింఛను కోసం దరఖాస్తు చేసుకొన్న వారికి కార్యక్రమం ముగిసేలోపే మంజూరు చేయాలని సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుర అధ్యక్షురాలు అలేఖ్య మాట్లాడుతూ పట్టణంలో అందరికీ ఇళ్లు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నామన్నారు. మద్దూరుపాడులో నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ గృహ సముదాయాలు పూర్తైనట్లు పేర్కొన్నారు. ప్రజల వద్దకే పాలనగా సీఎం జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం అంగనవాడీ చిన్నారులకు సమదుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా పట్టణ అధ్యక్షుడు అమరా, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, స్థానిక కౌన్సిలర్‌ అనురాధ, తదితరులు పాల్గొన్నారు. ఇదేవిధంగా 24వ వార్డులో కౌన్సిలర్‌ అయేషా, 27వ వార్డులో కౌన్సిలర్‌ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, 28 వార్డులో కౌన్సిలర్‌ నున్నా మృదుల, కోఆప్షన్‌ సభ్యులు నున్నా వెంకట్రావుల ఆధ్వర్యంలో జన్మభూమి మాఊరు కార్యక్రమాలు జరిగాయి.

nellore political news
Hariyan Srinivas
nellorepolitical news
Jan 07, 2018
nellore political news
Nellore Political News


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...