ఆత్మకూరులో రెండేళ్లలో 228 కోట్లతో అభివృద్ధి – మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డిnellore political news


ఆత్మకూరు లో రెండేళ్లలో 228 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి తెలిపారు. కనివిని ఎరుగని రీతిలో గత 70 ఏళ్లలో ఎన్నడూ జరగని విధంగా గత నాలుగేళ్లలో అభివృద్ధి జరిగిందని చెప్పారు ఆదివారం ఆత్మకూర్ లో జరిగిన జన్మభూమి మాఊరు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి బొల్లినేని కృష్ణయ్య లతో కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు ఇంకాచాలా అభివృద్ధి చేయాల్సి ఉంది ఇవన్నీ పూర్తయితే ఆత్మకూరు ఒక సుందరమైన పట్టణంగా రూపుదాలుస్తుంది ఆత్మకూరులో 2028 ఇళ్లను మంజూరు చేసాను గతంలో రెండు వందల ఇళ్లకు మించి ఇచ్చేవారు కాదు ఒకేసారి అధిక సంఖ్యలో లేనివారికి ఇల్లు ఇచ్చాం ఇంకా ఎవరైనా దరఖాస్తు చేస్తే వారికి కూడా ఇస్తాం నేను ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 11 కోట్ల రూపాయలు నీరు చెట్టు కింద మంజూరు చేశాను 20 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు మంజూరు చేశాం రెండున్నర కోట్లు మంజూరు చేశామ్ ఈ నెలాఖరులో గాని ఫిబ్రవరి మొదటి వారంలో గానీ ఆటో నగర్ టైలర్స్ కాలనీ షాది మంజీ ల్ లకు శంకుస్థాపన చేస్తాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించడమే గతంలో నెల్లూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాల్లో పార్టీ ఓడిపోయింది అయినప్పటికీ నిరుత్సాహపడకుండా అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాం జిల్లాలోని అన్ని సీట్లను గెలిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాట ఇచాం నిరంతరం మీ బా గు కు పాటు పడుతున్నాం జన్మభూమి ని చంద్రబాబు 1998 -99 సంవత్సరంలో ప్రారంభించారు, జరిగిన ప ను లు ఏమేరకు జరిగాయో తెలుసుకోవాలని ఉద్దేశంతో అధికారులని ప్రజల వద్దకు తీసుకొచ్చారు పరిష్కారం కాని సమస్యలను మార్గం చూపాలని భావించారు. రేషన్ కార్డులు , పెన్షన్లు రాని వారికి వచ్చే నెలలో అందజేస్తారు అని ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి రోడ్ల నిర్మాణానికి నేతలు పూజలు చేసి పనులను ప్రారంభించారు సీనియర్ నేతలు ఖాజావలి వైస్ చైర్మన్ చంద్రారెడ్డి వార్డు మెంబర్లు ఖాదర్ బాషా రేష్మా అలాగే రమణారెడ్డి మున్సిపల్ కమిషనర్ జెన్నీ రమణయ్య పాముల హరి నరసింహ రావు గిరినాయుడు ఆత్మకూర్ డి.ఎస్.పి తదితరులు పాల్గొన్నారు

nellore political news
Hariyan Srinivas
nellorepolitical news
Jan 07, 2018
nellore political news
Nellore Political News


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...