ఉదయం 6 గంటలనుండి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణాలను తనిఖీ చేస్తున్న మంత్రి నారాయణnellore political news


ఉదయం 6 గంటలనుండి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణాలను తనిఖీ చేస్తున్న మంత్రి నారాయణ, అమరావతిలో ఇంతవరకు ఇటుక కూడా పెట్టలేదు అన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిలో 48 వేల కోట్లతో మొదటి దశ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, ప్రజా ప్రతినిధులు ఐఏఎస్ అధికారులు ఉద్యోగుల కోసం నాలుగు వేలు అపార్ట్మెంట్లు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది, సివిల్ కోర్టు భవనాల నిర్మాణం దాదాపు పూర్తయింది, హైకోర్టు భవనాల నిర్మాణం కూడా వేగవంతంగా జరుగుతోంది, మొన్న 50 అంతస్థులతో నిర్మిస్తున్న సచివాలయానికి నాలుగు మీటర్ల మేర రాప్ట్ ఫౌండేషన్ వేశాం, దేశంలో ఎక్కడాలేని విధంగా డయాగ్రిడ్ ఫాం టెక్నాలజీతో రాజధాని పనులు జరుగుతున్నాయి, రాజధాని ప్రాంతం లోని 29 గ్రామాలలో మౌలిక వసతులు, 1600 కిలోమీటర్ల మేర ఇంటర్నల్ రోడ్ల పనులు జరుగుతున్నాయి, ఇప్పటికే అమరావతి గొప్ప పర్యాటక కేంద్రంగా మారింది, రాష్ట్రం నలుమూలల నుండి రోజుకు మూడు వేల మంది అమరావతిని సందర్శిస్తున్నారు అని తెలియజేసారు.అరుణ్ జెట్లీ అమరావతిలో ఇటుక కూడా పెట్టలేదు అంటున్నాడు

అరుణ్ జెట్లీ అమరావతిలో ఇటుక కూడా పెట్టలేదు అంటున్నాడు, ఎక్కడో ఏ సి రూములలో కూర్చునో , డయాసిస్ ల మీద నిలబడి మాట్లాడటం కాదు, ఇక్కడికొచ్చి చూస్తే తెలుస్తుంది అన్నారు. రాష్ట్రంలో బిజెపి నాయకులు అమరావతిలో అవినీతి జరిగిందంటున్నారు.ఇటువంటి పొంతన లేని మాటలు వల్ల నాయకులు విశ్వసనీయత కోల్పోతారు, బిజెపి ఇటు జగన్ తో అటు తెలంగాణ నాయకులతో అసత్య ప్రచారాలు చేసి లబ్ది పొందాలని భావిస్తారు.రాష్ట్రం పట్ల అరుణ్ జైట్లీ వంటి నాయకుల మాటలను ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. 2019లో బిజెపికి మరిచిపోలేని గుణపాఠం చెబుతారు అన్నారు

nellore political news
Hariyan Srinivas
nellorepolitical news
Jan 07, 2018
nellore political news
Nellore Political News


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...