ఉత్సాహంగా 5కే రన్‌ పాల్గొన్న వేలాది మంది విద్యార్థులు ఆటపాటలకే ప్రాధాన్యం : మంత్రి నారాయణnellore political news


కష్టపడి పనిచేయాలంటే మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆటపాటలకు ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర పట్టణ, పురపాలక శాఖ మంత్రి పొంగూరునారాయణ అన్నారు.ప్రతి పాఠశాలల్లోవిద్యార్థులతో వ్యాయామ విద్య కల్పిస్తున్నట్లు తెలిపారు. జన్మభూమి-మా ఊరులో భాగంగా జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ (డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నగరంలో 5కే పరుగు నిర్వహించారు.స్థానిక బోసుబొమ్మ సెంటరు నుంచి ప్రారంభమైన ఈపరుగు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం వరకు సాగింది. ఈ పరుగును మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.మంత్రి మాట్లాడుతూ వారానికి రెండున్నర గంటలు నడక, పరుగు చేస్తే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారని, అదే విధంగా ఆరోగ్యంపై అవగాహన కోసమే జన్మభూమిలో 5కే రన్‌ ప్రవేశపెట్టామన్నారు. నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమం జరిగిందన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన వారికి జన్మభూమి కార్యక్రమంలో సన్మానిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయరు అబ్దుల్‌ అజీజ్‌, జిల్లా సంయుక్త కలెక్టరు వెట్రి సెల్వి, సెట్నల్‌ సీఈవో ఎస్‌.వెంకట సురేష్‌, జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్‌, మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జున రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

చలిని లెక్క చేయకుండా..

జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 5కే రన్‌కు వేలాది మంది విద్యార్థులు, క్రీడాకారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. గత రెండు రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా.. చలిని లెక్క చేయకుండా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల నుంచి కళాశాల విద్యార్థులు పరుగులో పాల్గొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వెటరన్‌ క్రీడాకారులు పరుగు పందెంలో పాల్గొన్నారు. పలు అసోసియేషన్‌ సభ్యులు, వాకర్లు, అకాడమీ విద్యార్థులు, అథ్లెటిక్సులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీ క్రీడా మైదానంలో జాతీయ గీతంతో ముగింపు కార్యక్రమం జరిగింది. సెట్నల్‌ సీఈవో ఎస్‌.వెంకట సురేష్‌ మాట్లాడుతూ 5కే రన్‌ను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరికి పేరు పేరున ధన్యావాదాలు తెలిపారు. డీఎస్‌ఏ ఆహ్వానం మేరకు పరుగులో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమలో చీఫ్‌ కోచ్‌ పాండురంగారావు, డీఎస్‌ఏ అధికారులు పాల్గొన్నారు.

nellore political news
Hariyan Srinivas
nellorepolitical news
Jan 07, 2018
nellore political news
Nellore Political News


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...